హేమంత్ ఇంటి వద్ద 24గంటల భద్రత

అవంతిక తనకు కొంత మంది వ్యక్తుల నుండి ప్రాణహాని ఉందని చెప్పిన విషయం తెలిసిందే. కాగా దీనిపై సీపీ సజ్జనార్ స్పందిస్తూ అవంతికకు భద్రత కల్పిస్తామని హేమంత్ ఇంటి వద్దకు ఒక లేడి కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ ను పంపించాలని చందానగర్‌ పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు హేమంత్‌ కేసు విచారణ త్వరగా తేలేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసానని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన యుగేంధర్ రెడ్డి, […]

Written By: NARESH, Updated On : September 30, 2020 8:48 pm
Follow us on

అవంతిక తనకు కొంత మంది వ్యక్తుల నుండి ప్రాణహాని ఉందని చెప్పిన విషయం తెలిసిందే. కాగా దీనిపై సీపీ సజ్జనార్ స్పందిస్తూ అవంతికకు భద్రత కల్పిస్తామని హేమంత్ ఇంటి వద్దకు ఒక లేడి కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ ను పంపించాలని చందానగర్‌ పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు హేమంత్‌ కేసు విచారణ త్వరగా తేలేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసానని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన యుగేంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలను పోలీసులు ఆరు రోజుల పాటు విచారించనున్నారు.