
కరోనా మహమ్మారి కల్లోలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,399 మంది కొవిడ్ బారిని పడగా 89 మంది మరణించారు. కాగా 18,638 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. నూతన కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసుల 13,66,785 కు చేరుకున్నాయి. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,01,042 గా ఉంది. జిల్లాల వారీగా కొవిడ్ మరణాలు ఈ విధంగా ఉన్నాయి. విశాకపట్నం, విజయనగరం జిల్లాలో 11 మంది, చిత్తురు, తూర్పుగోదావరిలో 9 మంది మరణించారు.