
గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 89,087 మందకి కరోనా పరీక్షలు నిర్వహించగా 22,018 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13,88,803 మందికి కరోనా వైరస్ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 96 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9173 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 19,177 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 11 లక్షల 72 వేల 948 మంది డిశ్చార్జ్ అయ్యారు.