Homeజాతీయం - అంతర్జాతీయం2-డీజీ సాచెట్ ధర ప్రకటించిన రెడ్డీస్ ల్యాబ్స్

2-డీజీ సాచెట్ ధర ప్రకటించిన రెడ్డీస్ ల్యాబ్స్

డీఆర్ డీవో రూపొందించిన 2-డీజీ సాచెట్ ధరను రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించింది. కరోనా చికిత్సలో 2-డీజీ సాచెట్ అద్భుతంగా పని చేస్తుందని డీఆర్ డీవో తెలిపింది. ఒక్కో 2డీజీసాచెట్ ధర రూ. 990 గా రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించింది. చికిత్సలో ఒక్కొక్కరికి ఐదు నుంచి పది సాచెట్ లు అవసరం. చికిత్సకు ఒక్కో వ్యక్తికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చవుతుంది. కరోనా బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు 2-డీజీ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్ గురువారం మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి విదితమే. ఈ ఔషధాన్ని డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా తయారు చేశాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular