
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 18,767 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్ తో 104 మంది మరణించారు. తాజా కేసులతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 15,80,827కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్యం 2,09,237 ఇప్పటి వరకు సంభవించిన కొవిడ్ మరణాలు 10,126కి చేరాయి. జిల్లాల వారీగా చిత్తూరులో అత్యధికంగా 15 మంది మరణించారు. పశ్చిమగోదావరిలో 13, విజయనగరంలో 11, విశాఖపట్నంలో 9 మంది మరణించారు.