
ఏపీని కరోనా పీడిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 18,561 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో 14,54,052 కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 109 మంది మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 9481 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 2,11,554 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 12,33,017 మంది రికవరీ అయ్యారు