
ఆఫ్ఘనిస్థాన్ లో దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశం ఇప్పుడు తాబిబన్ ఫైటర్ల చేతుల్లోకి వెళ్లింది. అరాచక పాలనలో జీవించలేక పలువురు దేశాన్ని వీడుతున్నారు. కాబూల్ నుంచి భారత్ వైమానిక దళానికి చెందిన సీ -17 విమానంలో 168 మంది భారత్ కు చేరుకున్నారు. ఇవాళ ఉదయం కాబూల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరిన విమానం ఘజియాబాద్ లోని డిండన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో ల్యాండ్ అయ్యింది. విమానంలో 107 మంది భారతీయులతో సహా 168 మంది ఉన్నారు.