
దేశ వ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ లభ్యత, పంపిణీని పర్యవేక్షించడానికి 12 మంది సభ్యులతో నేషనల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, సమానంగా ఆక్సిజన్ అందేలా చూడటం ఈ టాస్క్ ఫోర్స్ బాద్యాత. కొవిడ్ చికిత్సకు అవసరమైన మందుల విషయంలోనూ ఈ టాస్క్ ఫోర్స్ అదే పని చేయనుంది. వివిధ రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న ఆక్సిజన్ కేటాయింపులను పునసమీక్షించాలని చెబుతూ అత్యున్నత న్యాయస్థానం ఈ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.