
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24 గంట వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 50,972 పరీక్షలు నిర్వహించగా 11,698 కేసులు నిర్ధారణ కాగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 10,20,926 మంది వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.