
మహారాష్ట్రలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. బుధవారం కొత్తగా 10,989 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,63,880 కు పెరిగింది. 24 గంటల్లో కొవిడ్ తో మరో 261 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,01,833కు చేరింది. గత రెండు రోజులుగా సరాసరిగా 10 వేల కేసులు నమోదవుతున్నాయి.