
దేశీయ ఉక్కు పరిశ్రమకు చెందిన స్టీల్ ప్లాంట్లు కరోనా చికిత్స కోసం వివిధ రాష్ట్రాలకు గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు 1.43 లక్షల టన్నుల మెడికల్ ఆక్సిజన్ ను సరఫరా చేశాయి. శనివారం ఒక్కరోజే 3,474 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేశాయి. దేశీయంగా ఆక్సిజన్ కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మరింతగా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.