
టీమ్ ఇండియా లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ దంపతులకు శనివారం పుత్రోత్సాహం కలిగింది. ఆయన సతీమణి గీతా బస్రా మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని భజ్జీ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. మేం పట్టుకునేందుకు ఇంకో చిన్నారి చేయి మా ఇంట్లోకి వచ్చింది. అతని ప్రేమ అమితమైనది. బంగారం అంతటి విలువైనది. ఇదో అద్భుతమైన బహుమతి. మాకు మగబిడ్డను ప్రసాదించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు ఇప్పుడు నా భార్య, చిన్నారి క్షేమంగా ఉన్నారని తెలిపాడు.