
కృష్ణా జలాల వృథాపై విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద తెదేపా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. నారుమళ్లకు ఇవ్వకుండా కృష్ణా నికర జలాలు సముద్రం పాల్జేస్తున్నారంటూ ఆందోళన తెలిపారు. నిరసనలో పాల్గొన్న తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలు కాపాడేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరించట్లేదు. రైతులకు ఇవ్వాల్సిన నీరు సముద్రం పాలు చేయడం దుర్మార్గం అని అన్నారు. జల వివాదాలపై లేఖలు రాస్తే సమస్య పరిష్కారమవుతుందా? అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని సీఎం ఎందుకు డిమాండ్ చేయట్లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.