
తెలంగాణలో రేపటి నుంచి జూపార్కులు, జింకల పార్కులు, జాతీయ వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు వాటిని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాధారణ ప్రజలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆట విడుపుగా పార్కులు, జూ పార్కులకు వెళ్తుంటారు. గత కొన్ని నెలలుగా కరోనా వ్యాప్తి కారణంగా వాటిని మూసి ఉంచారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో తిరిగి వాటిని తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.