
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తగ్గినట్టే తగ్గి కేసులు, మరణాలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 45,892 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రితం రోజుతో పోల్చితే 5 శాతం పెరుగుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3,07,09,557కి చేరాయి. నిన్న 817 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,05,028 మంది మహమ్మారికి బలయ్యారు. కరోనా రెండో దశలో గత 55 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి.