https://oktelugu.com/

‘పవన్’ను వాడుకోవడం ఆనవాయితీ అయింది !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కేబినెట్ హోదా ఖాయం అని తెలుగు మీడియా కొట్టిన డప్పు అంతా ఒట్టి బూటకం అని తేలిపోయింది. పవన్ కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు ప్రధానమంత్రి మోదీ బాగా ఉత్సాహ పడ్డారని తెలుగు మీడియా పవన్ పై కథనాలను అల్లింది. తీరా చూస్తే పవన్ కి అపాయింట్ మెంట్ ఇవ్వడానికి కూడా మోదీ ఇంట్రెస్ట్ గా లేరని కొత్త పుకార్లు పుట్టిస్తోంది. తమ టీఆర్పీ రేటింగ్స్ కోసం పవన్ […]

Written By:
  • admin
  • , Updated On : July 8, 2021 / 10:25 AM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కేబినెట్ హోదా ఖాయం అని తెలుగు మీడియా కొట్టిన డప్పు అంతా ఒట్టి బూటకం అని తేలిపోయింది. పవన్ కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు ప్రధానమంత్రి మోదీ బాగా ఉత్సాహ పడ్డారని తెలుగు మీడియా పవన్ పై కథనాలను అల్లింది. తీరా చూస్తే పవన్ కి అపాయింట్ మెంట్ ఇవ్వడానికి కూడా మోదీ ఇంట్రెస్ట్ గా లేరని కొత్త పుకార్లు పుట్టిస్తోంది.

    తమ టీఆర్పీ రేటింగ్స్ కోసం పవన్ చుట్టూ అవాస్తవాలను అల్లేసి ఎలాగోలా వ్యూస్ తెచ్చుకోవడానికి పేరొందిన తెలుగు మీడియా పత్రికలు, న్యూస్ ఛానెల్స్ తెగ ‘పులిహోర’కలిపేస్తున్నాయి. ఒక అపవాదు గురించి రాసే ముందు చెక్ చేసి సరిచేసుకోవడం కనీస బాధ్యత. అసలు చెప్పే వార్తలో విషయం లేకున్నా.. కలర్ ఫుల్ గా వడ్డించాలని ఇమేజ్ ఉన్నవాళ్ళ పై ఇలా అసత్య ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ ?

    పవన్ గురించి అబద్ధాలని, ఊహాగానాలను ఘంటాపథంగా చెప్పడం మన మీడియాకి బాగా అలవాటు అయిపోయింది. ఈ ధోరణి పొలిటికల్ జర్నలిజంలో ఎక్కువగా కనిపిస్తోంది. మరీ విచిత్రం ఏమిటంటే.. పవన్ తన నివాసంలో ఉంటే.. తెలుగు మీడియా మాత్రం పవన్ కళ్యాణ్ ఇక హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో దిగనున్నారని 10 రోజుల క్రితం లైవ్ ఇచ్చే లెవల్లో హడావుడి చేసింది.

    అప్పుడే అది నమ్మశక్యంగా లేదని మేము చెప్పిన విషయం తెలిసిన విషయమే. ఇక ప్రధానమంత్రి తన కేబినెట్ లోకి 43 మంది మంత్రులను తీసుకున్నారు. సహాయ మంత్రిగా ఉన్న తెలుగు వ్యక్తి కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా పదోన్నతి దక్కడం తెలుగు ప్రజలకు దక్కిన గౌరవం అనుకొని సరిపెట్టుకోవాలి. ఇక పవన్ తన జనసేన పార్టీ కార్యకలాపాలతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్నాడు.