
ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ రవికుమార్ దహియా క్వార్టర్ ఫైనల్ కు చేరాడు. కొలింబియాకు చెందిన టిగ్రరోస్ పై 13-2 తేడాతో విజయం సాధించాడు. మరోవైపు మహిళల రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో అన్షు మలిక్ నిరాశ పరిచింది. క్వార్టర్స్ కు ఆమె అర్హత సాధించలేకపోయింది. బెలారస్ కు చెందిన కురాచ్ కినా చేతిలో అన్షు మలిక్ ఓటమి పాలైంది.