
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జూలై 13న ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని తాజా కరోనా పరిస్థితి, వ్యవసాయం, పల్లె -పట్టణ ప్రగతి లాంటి అంశాలను ఎజెండాలో పెట్టినట్లు సీఎంఓ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న ఆసరా పింఛను పథకాన్ని ఆగస్టు నుంచి 57 ఏళ్లు పైబడినవారికి కూడా వర్తింపజేస్తామని బహిరంగ సభ సందర్భంగా సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో దానికి అవసరమైన ఆర్థక వనరులపై ఈ సమావేశంలో చర్చించి తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది. ఈ కొత్త ప్రకటన ద్వారా అదనంగా సుమారు ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులుగా చేరే అవకాశం ఉంది.