
మాజీ మంత్రి దేవినేని ఉమ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పునిచ్చింది. దేవినేని ఉమకు 41 ఏ కింద రక్షణ కల్పించండని పేర్కొంది. మే 7 తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని కోర్టు సూచించింది. ఈ నెల 29 న ఉదయం 11 గంటలకు మంగళగిరి సీఐడీ ఆఫీసులో విచారణకు దేవినేని ఉమ హాజరుకావాలని తెలిపింది. మే 7 వ తేదీకి కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.