
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడిన వారిలో 594 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇన్ఫెక్షన్ కారణంగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 6,47,229కి చేరాయి. ప్రస్తుతం 8,803 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 3,814 కు పెరిగాయి.