
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి పార్టమెంట్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు వైసీపి అభ్యర్తి గురుమూర్తి 69,724 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. వైసీపీకి 1,57,951 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 88,677 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 15574 ఓట్లు పోలయ్యాయి.