
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సినీనటి, ఎమ్మెల్యే రోజా డప్పు కొట్టి కార్యకర్తలో జోష్ నింపారు. నగరి నియోజవర్గం పుత్తూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే రోజాతల్లిపాల వారోత్సవాలలో పాల్గొన్నారు. అంగన్ వాడీ కార్యకర్తలతో సమావేశమై తల్లిపాల విశిష్టతను తెలియజేశారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల వ్యాధినిరోధన శక్తి పెరిగి బిడ్డ పెరుగుదలకు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆమె అన్నారు.