
బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ టికెట్ ఇచ్చినవాళ్లే నన్ను ఓడించాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏళ్లుగా కుడిభుజంగా ఉన్న తాను అర్ధగంటలోనే ఎలా దయ్యాన్నయ్యానని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్రలేదా? ఎక్కడ తిన్నామో, ఎక్కడ పడుకున్నామో కేసీఆర్ కు తెలియదా? అని అన్నారు. కరీంనగర్ మంత్రి జైలుకు వెళ్లారా? లేక తాను జైలుకు పోయానా? సీఎం తెలియదా అన్నారు. అధికార పార్టీలో ఉన్నా తన ఇంటిపై పోలీసులతో దాడి చేయించారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.