
రాయలసీమలోేని నీటి ప్రాజెక్టులు మరియు అభివృద్ధి అంశాలపై ముఖ్య నాయకులతో బీజేపీ కర్నూలు లో ఏర్పాటు చేసిన సమావేశం ప్రారంభమయ్యింది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర సహ ఇన్ చార్జి సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యులు టిజీ వెంకటేశ్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, రావెల కిశోర్ బాబు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.