
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ట్రెంట్ బ్రిడ్జ్ లో ఇప్పటిదాకా ఇంగ్లాండ్, ఇండియా మధ్య ఏడు మ్యాచ్ లు జరగగా అందులో భారత్ జట్టు రెండుసార్లు మాత్రమే విజయాన్ని అందుకుంది. మరో రెండింటిలో ఇంగ్లాండ్ విజయం సాదించగా, మూడు మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి.