
మైదానంలో పరుగుల వరద పారించి దిగ్గజంగా ఎదిగిన సునీల్ గవాస్కర్.. తన రెండో ఇన్నింగ్స్ లో ఎందో మంది చిన్నారులకు ప్రాణాదానం చేస్తూ మహాన్నత వ్యక్తిగా మారాడు. గుండె జబ్బులతో పుట్టే చిన్నారుల సమస్య గురించి అవగాహన కల్పించడంతో పాటు ఎలాంటి ఖర్చు లేకుండా వాళ్లకు చికిత్స అందించేందుకు విరాళాల సేకరణ కోసం కొన్నేళ్ల కిత్రం ఈ ఫౌండేషన్ స్థాపించానని సన్నీ చెప్పాడు. మన దేశంలో మూడు లక్షలకు పైడా చిన్నారులు గుండె జబ్బులతో పుట్టారని, వాళ్లలో మూడో వంతు పసివాళ్లు తమ తర్వాతి పుట్టినరోజు చూడకుండానే చనిపోతున్నారని గావస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.