
ఈనెల 5న రాయలసీమ ఎత్తిపోతల పథక నిర్మాణ ప్రాంతానికి కేఆర్ఎంబీ బృందం వెళ్లనుంది. గతంలో సందర్శనకు వస్తామన్నా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. తాజా పర్యటనపై ఏపీకి కేఆర్ఎంబీ బృందం సమాచారం ఇచ్చింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ బృందం పర్యటించనుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించి కేఆర్ఎంబీ ప్రతినిధులు ఎన్జీటీకి నివేదిక ఇవ్వనుంది. కేఆర్ఎంబీ బృందంలో తెలంగాణ ప్రతినిధులు ఎవరూ ఉండకూడదని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.