
కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకవత్ తో వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాన్ని ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి ఎంపీలు తీసుకువచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, కృష్ణా జలాలపై తెలంగాణ వైఖరి సహా నీటి ప్రాజెక్టుల అంశాలపై కేంద్రమంత్రితో చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి ఎంపి ఫిర్యాదు చేశారు.