
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు మద్దతిస్తామని మావోయిస్టు విశాఖ తూర్పు డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం బూటకపు సంస్కరణలు చేస్తోందని ఆమె ఆక్షేపించారు. ఈ మేరకు అరుణ పేరిట ఆడియో టేపు విడుదలైంది. ప్రభుత్వ మోసపూరిత విధానాలపై ఉద్యమించాల్సి ఉంది అని ఆడియో టేపులో అరుణ పేర్కొన్నారు.