
గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సైనికుడు జశ్వంత్ రెడ్డి (23) వీరమరణం పొందడంపై సీఎం జగన్ దిగ్ర్భింది వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. జశ్వంత్ రెడ్డి త్యాగం మరువలేనిదని అన్నారు. జమ్ముకశ్మీర్ లోని సుందర్ బాని సెక్టార్ లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో జశ్వంత్ రెడ్డి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.