https://oktelugu.com/

గన్నవరం లో ఘోర రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి సావరగూడెం కూడలి వద్ద లారీ బోల్తా పడింది. చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. లారీ పై భాగంలో కూర్చున్న భార్యాభర్తలు, చిన్నారి దుర్మరణం చెందారు. బిహార్ నుంచి బెంగళూరుకు బియ్యం లోడ్ తో లారీ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. లారీ కింద ఉన్న మృతదేహాలను తీసేందుకు […]

Written By: , Updated On : July 7, 2021 / 08:57 AM IST
Follow us on

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి సావరగూడెం కూడలి వద్ద లారీ బోల్తా పడింది. చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. లారీ పై భాగంలో కూర్చున్న భార్యాభర్తలు, చిన్నారి దుర్మరణం చెందారు. బిహార్ నుంచి బెంగళూరుకు బియ్యం లోడ్ తో లారీ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. లారీ కింద ఉన్న మృతదేహాలను తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతులను ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు.