ఆరుగురు టీఎంసీ ఎంపీలపై సస్పెన్షన్

రాజ్యసభ కు చెందిన ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఛైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేశారు. పెగాసస్ వ్యవహారంపై చర్చ చేపట్టాలని వెల్ కి దూసుకువచ్చి, ప్లకార్డులు ప్రదర్శించిన ఘటనలో ఆ ఎంపీలను బహిష్కరించారు. ఒక రోజు పాటు వారిపై సస్పెన్షన్ విధించారు. సస్పెండ్ అయిన వారిలో డోలాసేన్, నదీముల్ హక్, అబిర్ రంజన్ బిశ్వాన్, శాంతా చెత్రి, అర్పితా ఘోష్, మౌసమ్ నూర్ లు ఉన్నారు. ఈ ఆరుగురు ఎంపీలు రాజ్యసభ వెల్ లోకి వచ్చారని, […]

Written By: Suresh, Updated On : August 4, 2021 2:25 pm
Follow us on

రాజ్యసభ కు చెందిన ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఛైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేశారు. పెగాసస్ వ్యవహారంపై చర్చ చేపట్టాలని వెల్ కి దూసుకువచ్చి, ప్లకార్డులు ప్రదర్శించిన ఘటనలో ఆ ఎంపీలను బహిష్కరించారు. ఒక రోజు పాటు వారిపై సస్పెన్షన్ విధించారు. సస్పెండ్ అయిన వారిలో డోలాసేన్, నదీముల్ హక్, అబిర్ రంజన్ బిశ్వాన్, శాంతా చెత్రి, అర్పితా ఘోష్, మౌసమ్ నూర్ లు ఉన్నారు. ఈ ఆరుగురు ఎంపీలు రాజ్యసభ వెల్ లోకి వచ్చారని, చైర్మన్ ఆదేశాలను ధిక్కరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారని అందుకే సస్పన్షన్ విధిస్తున్నట్లు రాజ్యసభ ఓ ప్రకటనలో తెలిపింది.