TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లలో నిర్దేశించిన పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేలా చర్యలు చేపట్టింది. ఇటీవల గురుకుల పోస్టు భర్తీలో అనుసరించిన విధానంతో సుమారు 3 వేల పోస్టులు మిగిలిపోయాయి. దీనిపై అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో మిగతా పోస్టులను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తర్వాత అర్హులతో భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంతో టీఎస్పీఎస్సీ అలర్ట్ అయింది. అత్యధిక సంఖ్యలో కొలువులున్న జిల్లాస్థాయి ఉద్యోగ కేటగిరీలో ప్రాథమిక అర్హుల జాబితా ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించనుంది. జిల్లాస్థాయి కేటగిరీ ఉద్యోగాల్లో గ్రూప్–4 ఉద్యోగాలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. దాదాపు 9 వేల ఉద్యోగాలుండగా… వీటి భర్తీకి 1:3 నిష్పత్తి ఫార్మూలానే అమలు చేయనున్నారు. దీంతోపాటు జిల్లాస్థాయిలోకి వచ్చే ఇతర పోస్టులకూ ఇదే ఫార్ములా అమలు చేయనున్నట్టు సమాచారం.
అన్ని పోస్టుల భర్తీ..
ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేయడం ద్వారా అన్ని పోస్టులను భర్తీ చేయవచ్చని కమిషన్ భావిస్తోంది. ఇక జోనల్, మల్టీజోనల్ స్థాయి ఉద్యోగాలను మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఈ అంశాలపై అతి త్వరలో నిర్ణయం తీసుకుని అమలు చేసే అవకాశం ఉంది.
ఉద్యోగాల భర్తీ వేగవంతం..
టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. పెండింగ్లో ఉన్న అర్హత పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇప్పటివరకు నిర్వహించిన అర్హత పరీక్షల్లో మెజారిటీ పరీక్షలకు ‘కీ’లు, జవాబుపత్రాల ’కీ’, మెజారిటీ పరీక్షలకుగాను జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)లను కూడా కమిషన్ విడుదల చేసింది. జీఆర్ఎల్కు సంబంధించి ఇప్పుడు ప్రాథమిక ఎంపిక జాబి తాను విడుదల చేయాల్సి ఉంది. దీనికోసం అంతర్గత ప్రక్రియను అధికారులు వేగవంతం చేసినట్టు సమాచారం. ప్రాథమిక ఎంపిక జాబితా విషయంలో టీఎస్పీఎస్సీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటన, ఆ తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన, చివరగా తుది జాబితాల ప్రకటన చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది.
ఉద్యోగాలు ఇలా..
ప్రస్తుతం జిల్లాస్థాయి, జోనల్స్థాయి, మల్టీజోనల్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా… ఇప్పటివరకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఐఆర్బీ), తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎంహెచ్ఎస్ఆర్బీ)లు ప్రాథమిక జాబితాల ఎంపికలో 1:2 నిష్పత్తిని నిర్ధారించుకుని ఉద్యోగాల భర్తీ పూర్తి చేశాయి. దాదాపు 33 వేల ఉద్యోగాలను ఇదే పద్ధతిలో భర్తీ చేశారు. నోటిఫికేషన్లో నిర్దేశించిన పోస్టులు, భర్తీ ప్రక్రియ పరిశీలిస్తే దాదాపు 15 శాతం పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఒక్కో అభ్యర్థికి రెండు, అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం, అన్ని రకాల పోస్టులకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావడం, ప్రాధాన్యత క్రమంలో నచ్చిన కొలువు ఎంచుకోవడం, సరైన అభ్యర్థులు లేకపోవడం లాంటి కారణాలతో ఇలా మిగిలి పోయినట్టు అధికారవర్గాలు భావిస్తున్నాయి. దీంతో అర్హుల ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Tspsc strategy in job recruitment exams 13 ratio for district category posts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com