https://oktelugu.com/

Jobs: భారీ వేతనాలతో అటవీశాఖలో ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రిక్రూడ్‌మెంట్‌ ప్రాసెస్‌ కోసం నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు 37 పోస్టులతో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ)నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 17, 2024 / 03:49 PM IST
    Jobs

    Jobs

    Follow us on

    Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు ఎన్నికల జాతర కొనసాగుతుండగా, మరోవైపు ఉద్యోగాలకు దరఖాస్తుల జాతర మొదలైంది. అటవీశాఖలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 37 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

    మే 5 వరకు దరఖాస్తుల స్వీకరణ..
    ఇక ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవర్చు. రాత పరీక్ష, కంప్యూటర్‌ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

    ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌..
    ఇక ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రిక్రూడ్‌మెంట్‌ ప్రాసెస్‌ కోసం నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు 37 పోస్టులతో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ)నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 8 ఫారెస్టు రేంజ్‌ ఆఫీస్ల కోసం ఈ నోటిఫికేషన్‌ ఇచ్చింది.

    వెబ్‌సైట్‌లో అర్హత వివరాలు..
    ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులకు అర్హతల వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందు పర్చింది. దరఖాస్తు రుసుము, వయో పరిమితి, శారీరక ప్రమాణాలు, పరీక్ష పథకం, సిలబస్‌ మొదలైన వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. మార్చి 6న విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభించింది.

    జోన్ల వారీగా పోస్టులు ఇలా..
    జోన్‌ –I 08
    జోన్‌–II 11
    జోన్‌–III 10
    జోన్‌–IV 08

    మొత్తం 37