Job Notification: ఇంటర్‌ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులో తెలుసా?

ప్రభుత ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్న వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఇంటర్‌ విద్యార్హతతో కేంద్రంలోని పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Written By: Raj Shekar, Updated On : April 10, 2024 12:32 pm

Job Notification

Follow us on

Job Notification: ఇంటర్‌ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. అర్హుత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

3,712 పోస్టులు..
ప్రభుత ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్న వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఇంటర్‌ విద్యార్హతతో కేంద్రంలోని పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో లోయర్‌ డివిజనల్‌ క్లర్కు, జూనియర్‌ సెక్రటేరియేట్‌ అసిస్టెంట్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌–2024’ పేరిట ప్రకటన జారీ చేసింది. మొత్తం 3,712 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, మే 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. టైర్‌ – 1 పరీక్ష జూన్‌/జులైలో నిర్వహించే అవకాశం ఉంది.

నోటిఫికేషన్ ముఖ్యాంశాలు..

అర్హతలివే..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2024, ఆగస్టు 1 నాటికి ఇంటర్‌ పాస్‌ అయిన అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక శాఖల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు ఇంటర్‌లో సైన్స్ మ్యాథ్స్‌ గ్రూపుతో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఉండాలని నిబంధన విధించారు.

ఫీజు వివరాలు..
జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.100 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ/ఎస్టీలు, దివ్యాంగులు చెల్లించాల్సిన అవసరం లేదు.

వయో పరిమితి..
అభ్యర్థులు 2024 ఆగస్టు 1 నాటికి 18–27 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10–15 ఏళ్లు చొప్పున సడలింపు కల్పించారు.

వేతనాలు ఇలా..
లోయర్‌ డివిజన్‌ క్లర్కు, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పేలెవెల్‌–2 కింద రూ.19,900– రూ.63,200 చొప్పున చెల్లిస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు పే లెవెల్‌ –4 (రూ.25,500–81,100, పే లెవెల్‌ –5 (రూ.20,200–02,300) డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్‌ ’ఎ’ పోస్టులకు పే లెవెల్‌ –4 (రూ.25,500–81,100 చొప్పున వేతనం చెల్లిస్తారు.

ఎంపిక విధానం..
టైర్‌–1, టైర్‌–2 ఆన్‌లైన్‌ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ప్రాథమిక ఎంపిక ఉంటుంది. ఆ తర్వాత వారు దరఖాస్తు చేసుకున్న పోస్టు ఆధారంగా మూడో దశలో కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్టు నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష, ద్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. కేటగిరీల వారీగా పోస్టుల ఖాళీల వివరాలను వెబ్‌సైల్‌లో త్వరలోనే అప్డేట్‌ చేయనున్నారు. రాష్ట్రాల వారీగా/ జోన్ల వారీగా ఖాళీలను ఇంకా కమిషన్‌ సేకరించలేదు.