Vastu Tips: వాస్తును నమ్మేవారు చాలా మంది ఉంటారు. కొందరు ఇంటిని మాత్రమే కాదు ఇంట్లోని వస్తువులను కూడా వాస్తు ప్రకారమే పెట్టాలి అంటారు. అయితే బీరువా, టీవీ, డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు కూడా వాస్తు ప్రకారమే పెడుతుంటారు. మరి ఇంట్లో కొన్ని వస్తువుల వల్ల ఇంటికి నెగిటివ్ ఎనర్జీ వస్తుందట. మరి ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి? ఏ వస్తువులు ఉండకూడదు అనే విషయాలు ఓ సారి తెలుసుకోండి.
మందులు.. వంట గదిలో మెడిసిన్స్ ను అసలు ఉంచకూడదు. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి అంటున్నారు వాస్తు నిపుణులు. వంటగది ఆహారాన్ని అందించే గది. అలాంటి గదిలో ఔషధాలను ఉంచితే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.
అద్దాలు.. బెడ్ రూమ్ లో అద్దాలు ఉంచడం అసలు మంచిది. కాదు. దీనివల్ల కుటుంబంలో కలహాలు, విభేదాలు, హింస వంటివి చోటు చేసుకుంటాయట. అందుకే నిద్రపోయే స్థలంలో అసలు అద్దాలను ఉంచకూడదు.
కాక్టస్ మొక్క.. చాలామందికి ఇంట్లో మొక్కలను పెంచుకునే అలవాటు ఉంటుంది. అందులో ముఖ్యంగా కాక్టస్ మొక్కలను కూడా పెంచుతుంటారు. ఈ మొక్కల వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుందట. ముళ్ళతో ఉండే ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం అశుభం అంటారు వాస్తు నిపుణులు. వీటిని ఇంట్లో పెంచితే కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు, సంబంధాలపై ప్రభావం చూపించడం వంటివి జరుగుతాయట.
వాడని వస్తువులు.. కొందరు వాడని వస్తువులను కూడా అలాగే పెడుతుంటారు. ఎప్పటికీ ఉపయోగం లేని వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. వీటిని ఇంట్లో ఉంచకుండా పడేయడమే మంచిది అంటున్నారు నిపుణులు. డెకరేటివ్ ఐటమ్స్, అద్దాలు, ఫోటోలు, ఫర్నీచర్ ఏమైనా పాడైనవి ఉన్నా, వాడనివి, నిరుపయోగంగా ఉన్నవి ఇంట్లో ఉంచకూడదట.
ఈ సమాచారం కేవలం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్ సదుపాయం తో మాత్రమే మీకు అందించడం జరిగింది. ఈ విషయాన్ని ఒకే తెలుగు నిర్ధారించదు.