Job Opportunities: ఐటిఐ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం( Ap government) గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఏపీఎస్ఆర్టీసీ వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ కోసం ఐటిఐ చదివిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని ఆర్టీసీ డిపో గ్యారేజీల్లో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్లలో ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు వచ్చే నెల 12 లోపు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. విజయనగరం వీటి అగ్రహారంలోని ఆర్టీసీ ఓనల్ స్టాప్ ట్రైనింగ్ కాలేజీ దగ్గర ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు.
* ఆ జిల్లాల వారికి మాత్రమే..
రాష్ట్రంలో తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని ఐటిఐ చదివిన అభ్యర్థుల కు మాత్రమే ఈ అవకాశం కల్పించింది ఏపీఎస్ఆర్టీసీ. డీజిల్ మెకానిక్, మోటార్, వెల్డర్ వంటి ట్రేడ్ లలో అప్రెంటిస్ చేసేందుకు ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ చెబుతోంది. అయితే అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో నూట పద్దెనిమిది రూపాయల ఫీజు చెల్లించి రసీదు పొందాల్సి ఉంటుంది. దరఖాస్తుతో దానిని జత చేసి ఆర్టీసీ జోనల్ స్టాఫ్ కాలేజీ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి మూర్తి ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. అభ్యర్థులకు సందేహాలు ఉంటే 088922- 294906 నంబర్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. అయితే అప్రెంటిస్ పూర్తి చేసుకున్న ఐటిఐ అభ్యర్థులకు అవసరం అనుకుంటే ఆర్టీసీలోనే ఉద్యోగ,ఉపాధి అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది.
* భవిష్యత్తు అవసరాల కోసం..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలన్న ప్రతిపాదన ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎలక్ట్రికల్ బస్సులను అందించనుంది. అదనపు బస్సులు వస్తున్న నేపథ్యంలో గ్యారేజ్ సిబ్బంది అవసరం. డిపోల్లో పనిచేసేందుకు మెకానిక్ల అవసరం కూడా ఉంటుంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అయితే అభ్యర్థుల అప్రెంటిస్ విధానానికి ఆర్టీసీ మొగ్గు చూపుతోంది. తద్వారా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అప్రెంటిస్ మేళా కొనసాగించనుంది.