Pawan Kalyan on Amalapuram: అమలాపురం విధ్వంసం వెనుక అధికార పార్టీ డిజైన్ ఉందా? వైసీపీ నేతలే తమ ఇళ్లపై దాడులు చేయించుకున్నారా? ప్రభుత్వం పట్ల ఎస్సీల్లోని వ్యతిరేకతను దారిమళ్లించేందుకే ఘటనకు పాల్పడ్డారా? అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ అవుననే అంటున్నారు. ఈ ఘటన వెనుక జనసేన ఉందన్న అధికార పార్టీ ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పలు అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. . అమలాపురం సంఘటనలో జనసేన హస్తం ఉందని వైసీపీ మంత్రులు, నాయకులు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. పోలీస్ వ్యవస్థను మీ చేతుల్లో పెట్టుకొని దాడులకు జనసేన కారణమని మాట్లాడటం ఏమిటని ఆగ్రహించారు. గతంలో కాకినాడకు చెందిన ఒక ఎమ్మెల్యే నన్ను వ్యక్తిగతంగా దూషిస్తే ఆయనకు మా పార్టీ నేతలు నిరసన తెలిపారు. నిరసన తెలుపుతున్నవారిపై ఆయన అనుచరులు దాడులకు పాల్పడ్డారు. నేను కేవలం పరామర్శించడానికి అక్కడకు వెళ్తేనే 144 సెక్షన్ విధించి, నా పర్యటన పూర్తయ్యేవరకూ పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. అలాంటిది నెలరోజులుగా జిల్లాపేరు మార్పుపై కోనసీమ ప్రాంతంలో భావోద్వేగాలు చెలరేగుతుంటే మరెంత జాగ్రత్తగా వారు ఉండాలి? కానీ, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగలబడుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం ఏమిటని ప్రశ్నించారు.
నిజంగా దాడులు జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు 144 సెక్షన్ విధించి మంత్రుల ఇళ్ల వద్ద వేల సంఖ్యలో పోలీసుల్ని ఎందుకు మోహరించలేదని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. కోనసీమ గొడవల వెనుక పక్కా డిజైన్ ఉందని ఆరోపించారు. గొడవ జరగాలని వైసీపీ నాయకులు కోరుకున్నారని కూడా దుయ్యబట్టారు. మాజీ డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అడ్డంగా దొరికిపోయారని.. ఆ కేసును పక్కదారి పట్టించాలనే దురుద్దేశంతోనే కోనసీమకు అధికారపక్షం చిచ్చు పెట్టింది అని మండిపడ్డారు. దాడికి గురైంది మంత్రి విశ్వరూప్ సొంత ఇల్లు కాదని.. అది అద్దె ఇల్లు అని, దాడికి ముందే మంత్రి కుటుంబీకులను పోలీసులు అక్కడ నుంచి ఎలా తరలించారో అందరికీ తెలుసునన్నారు.
Also Read: Modi vs Kcr: మోడీ ముఖాన్ని కేసీఆర్ ఎందుకు చూడలేకపోతున్నారు? పారిపోతున్నారు?
కుల ఘర్షణలు వద్దు..
కుల ఘర్షణలు రావణకాష్ఠం లాంటివని.. దీనికి గత అనుభవాలను పవన్ ఉదహరించారు. ఒక్కసారి అంటుకుంటే దేశమంతా కాలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వైసీపీ మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడి గొడవలు పెంచే ప్రయత్నం చేయడం చాలా తప్పన్నారు. మంటలను తగ్గించే ప్రయత్నాలు చేయడం లేదన్నారు. కోనసీమ జిల్లా విషయంలో వైసీపీ కుట్ర దాగి ఉందన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు గెజిట్‌లో బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టకుండా, ఇప్పుడు హడావుడిగా కోనసీమ జిల్లాకు ఆ పేరు పెట్టడం ఏమిటన్నారు. కొత్త జిల్లాల్లో కొన్నింటికి శ్రీసత్యసాయి, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు వంటి వారి పేర్లతో నామకరణం చేశారు. అప్పుడే అంబేడ్కర్ కోనసీమ జిల్లాని కూడా ప్రకటిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. కావాలని జాప్యం చేయడంలో వైసీపీ ఉద్దేశం ఏమిటన్నారు? నోటిఫికేషన్ జారీచేసి అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా వినతులు ఇవ్వాలని కోరడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దీని వెనుకనున్న దురుద్దేశం ఏమిటో సృష్టంగా తెలుస్తోందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఏర్పాటు చేసిన కమిషన్లు ప్రతి జిల్లాకు వెళ్లి వాళ్ల వాళ్ల అభ్యంతరాలు తెలుసుకునేవన్నారు. ఇప్పుడు మాత్రం సమూహంగా కాకుండా వ్యక్తులుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతలు ఇవ్వాలని అడగడం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ అంబేద్కర్ పట్ల గౌరవభావం ఉంటుందని, ఆయన పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమని పవన్‌కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా ఒక్క కోనసీమకే ఆయన పేరు ఎందుకు పెట్టాలి? కడప జిల్లాకు ఆ పేరు పేరు పెట్టొచ్చు కదా? ఎస్సీల పట్ల వైసీపీ ప్రభుత్వానికి ప్రేమ ఉండి అంబేడ్కర్ పేరు జిల్లాకు పెట్టిందని అనుకోలేం. అమరావతికి చెందిన ఎస్సీ రైతుల మీద జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడాన్ని ఎలా మరవగలమని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రా తొలిస్థానంలో ఉన్నట్టు కేంద్రం మంత్రి రాందాస్ అథవాలే స్వయంగా చెప్పారు. అనంతపురం జిల్లాలో కొంత భాగానికి సత్యసాయి జిల్లాగా నామకరణం చేసినప్పుడు కొంత మందికి ఆ పేరు నచ్చలేదు. నా దగ్గరకు వచ్చి దానిపై మాట్లాడాలని కోరారు. అయితే అది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని, స్థానికంగా మీ అభిప్రాయాలు తెలపాలని చెప్పాను. తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశాం అని పవన్ గుర్తుచేశారు.
Also Read:Konaseema Tension: అమలాపురం విధ్వంసం వెనుక ఎన్నో అనుమానాలు.. వారి పనేనా?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Janasena chief pawan kalyan responds to amalapuram tensions
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com