https://oktelugu.com/

నైజర్లో దారుణం: 100 మంది కాల్చివేత

పశ్చిమాఫ్రికాలో ఉగ్రవాదులు తెగబడ్డారు. విచక్షణా రహితంగా 100 మందిని కాల్చివేశారు. ఆఫ్రికాలోని నైజర్ దేశంలో శనివారం ఇద్దరు ఉగ్రవాదులను తోచబంగౌ, జారౌమ్ దారే అనే గ్రామాల ప్రజలు కొట్టి చంపారు. తమ గ్రామాలపై దౌర్జన్యాలకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడ్డారు. దీంతో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆ రెండు గ్రమాలపై దాడి చేసి దాదాపు 100 మంది వరకు కాల్చి చంపారు. బోకోహారమ్ గ్రూపునకు చెందిన ఆల్ ఖౌదాతో సంబంధాలున్నట్లు వారు ప్రకటించారు. ఈ ఘటనపై నైజర్ ప్రధాని […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 4, 2021 / 08:47 AM IST
    Follow us on

    పశ్చిమాఫ్రికాలో ఉగ్రవాదులు తెగబడ్డారు. విచక్షణా రహితంగా 100 మందిని కాల్చివేశారు. ఆఫ్రికాలోని నైజర్ దేశంలో శనివారం ఇద్దరు ఉగ్రవాదులను తోచబంగౌ, జారౌమ్ దారే అనే గ్రామాల ప్రజలు కొట్టి చంపారు. తమ గ్రామాలపై దౌర్జన్యాలకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడ్డారు. దీంతో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆ రెండు గ్రమాలపై దాడి చేసి దాదాపు 100 మంది వరకు కాల్చి చంపారు. బోకోహారమ్ గ్రూపునకు చెందిన ఆల్ ఖౌదాతో సంబంధాలున్నట్లు వారు ప్రకటించారు. ఈ ఘటనపై నైజర్ ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాలి సరిహద్దు సమీపంలోని గ్రామాలపై నిన్న ఉగ్రవాదులు దాడి చేశారని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అల్కాచే అల్హడా తెలిపారు.