కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నిబంధనల వల్ల పాఠశాలలు మూతబడటంతో ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్ లైన్ ద్వారా పాఠాలను బోధిస్తున్నాయి. అయితే ఆన్ లైన్ తరగతుల వల్ల పిల్లలపై ఒత్తిడి పెరగడంతో పాటు పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలుస్తోంది. 10 సంవత్సరాల లోపు పిల్లలు జ్ఞానేంద్రియాల సహాయంతో ఏ విషయాన్నైనా సులభంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది.
Also Read: దంతాలు పుచ్చిపోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?
అయితే ఆన్ లైన్ పాఠాల వల్ల పిల్లల భావ వ్యక్తీకరణ, మెదడు, ప్రవర్తనపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలుస్తోంది. ఫలితంగా విద్యార్థులలో ఆలోచించే శక్తి తగ్గుతుందని పిల్లల్లో తార్కిక జ్ఞానం కూడా తగ్గుతోందని సమాచారం. ఒత్తిడి మరింత పెరిగితే పిల్లల్లో చదువుపై ఆసక్తి తగ్గుతుంది. ఆన్ లైన్ బోధన వల్ల ఉపాధ్యాయులు సైతం చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతున్నారు.
Also Read: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..?
పదేళ్ల లోపు పిల్లల్లో ఈ తరహా సమస్యలు కనిపిస్తుండగా ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ లను గేమ్స్, మూవీస్, చాటింగ్ కోసం వినియోగిస్తున్నారు. వీటి ప్రభావం విద్యార్థులపై ఉంటే విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆన్ లైన్ తరగతుల వల్ల పిల్లల్లో క్రమశిక్షణ తగ్గుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
ఆన్ లైన్ క్లాసుల సమయంలో కాకుండా మిగతా సమయంలో విద్యార్థులను తల్లిదండ్రులకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లకు దూరంగా ఉంచితే మంచిది. పిల్లలకు ఖాళీ సమయాల్లో ఆటలు ఆడేలా ప్రోత్సహించడంతో పాటు వాళ్లు ఏదో ఒక పనిలో బిజీగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఆన్ లైన్ క్లాసులకు ప్రతిరోజూ సమయానికి హాజరయ్యేలా జాగ్రత్త వహించాలి