అమెరికా ఉపాధ్యక్షరాలిగా ఎన్నికైన భారత సంతతి మహిళా కమలాహారిస్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ విజయం అందరికీ మార్గదర్శం..ఈ గెలుపు మీకే కాదు ఇండియన్ అమెరికన్లందరిది. మీ గెలుపుతో అమెరికా, భారత్ సత్సంబంధాలు మరింత మెరుగుపడుతాయని ఆశిస్తున్నాం’ అని ట్విట్టలో మోదీ ట్వీట్ చేశారు. కాగా కమలా హారిస్ గెలుపుతో అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా రికార్డు సాధించారు. అలాగే తొలి నల్లజాతీయురాలు కూడా ఆమెనే కావడం గమనార్హం. డెమొక్రటిక్ పార్టీ తరుపున బరిలో ఉండడంతో ప్రవాస భారతీయ ఓట్లు ఎక్కువగా ఆ పార్టీకే పడ్డట్లు తెలుస్తోంది. కాగా తమిళనాడులోని ఆమె తల్లి సొంతూరులో స్థానికులు సంబరాలు నిర్వహించుకున్నారు.