
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ లాకయింది. ట్రంప్ ట్విట్టర్లో పేర్కొన్న కొన్ని అంశాలపై ట్విట్టర్ యాజమాన్యం అసంత్రుప్తి వ్యక్తం చేసింది. దీంతో 12 గంటలపాటు ఆయన అకౌంట్ ను హోల్డ్లో పెట్టారు. నిబంధనలకు వ్యతిరేకంగా ట్రంప్ కొన్ని ట్వీట్లు చేశారని, వాటిని తొలగించకపోతే శాశ్వతంగా తన అకౌంట్ ను రద్దు చేస్తామని పేర్కొంది. ఇదే బాటలో ఫేస్బుక్ యాజమాన్యం కూడా హెచ్చరించినట్లు సమాచారం. దీంతో ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగపోకముందే అన్ని విషయాల్లోనే అభాసుపాలవుతున్నారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ సమావేశమైంది. ఈ సమయంలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకు వచ్చేందుకు యత్నించారు.