జమ్మూకాశ్మీర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. గత సోమవారం హన్లేకి ఈశాన్యాన 51 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. అయితే జనవాసాలు లేకపోవడంతో పెద్దగా నష్టమేమీ కాలేదు. తాజాగా పహల్‌గాం సమీపంలో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధికారులు ప్రకటించారు. రిక్టర్‌స్కేల్‌పై దాని తీవ్రత 4.1గా నమోదైందని పేర్కొన్నారు. అయితే ఈసారి జరిగిన భూకంపంపై జరిగిన నష్టంపై ఆరా తీస్తున్నారు.