
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాపై తీవ్ర విమర్శలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా బైడెన్‌తో జరుగుతున్న డిబేట్‌లో భారతదేశం మురికిగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘చైనా, రష్యా, ఇండియాలను చూడండి.. ఎంత మురికిగా ఉంటాయో.. అక్కడ గాలి కూడా కలుషితంగా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. గతంలోనూ కరోనా కేసుల లెక్కలు చెప్పట్లేదని ట్రంప్ అన్న వాఖ్యలు తెలిసిందే. ఇప్పుడో మరోసారి ఇండియాపై విమర్శలు చేయడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.