Shubman Gill: ఈ ఐపీఎల్ లో బాగా పాపులర్ అయినా క్రికెటర్స్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లేయర్ అయినా శుభ్ మన్ గిల్ ఒకరు…ఈ ఒక్క ఐపీఎల్ సీజన్ లోనే ఆయన మూడు సెంచరీ లు చేసి ఈ ఐపీఎల్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు…ఈయన చేసిన స్కోర్ వల్లే గుజరాత్ చాలా మ్యాచ్ ల్లో గెలిచింది…ఈయన ఇండియా తరుపున ఏషియా కప్ లో చాలా అద్బుతం గా రాణించాడు.ఇక ఇపుడు జరుగుతున్న వరల్డ్ కప్ లో కూడా బాగా రాణిస్తున్నాడు. అయితే అసలు శుభ్ మన్ గిల్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఇంత బాగా క్రికెట్ ఆడటానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
ఇక మ్యాటర్ లోకి వస్తే గిల్ 1999 సెప్టెంబర్ 8 వ తేదీన పంజాబ్ లోని ఫాజిల్ కానగర్ లో లిఖ్విందర్ గిల్, కిరాదు గిల్ దంపతులకి జన్మించాడు. లిఖ్విందర్ గిల్ తన ఊరు లోనే తనకు ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు…కానీ లిఖ్విందర్ గిల్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం ముఖ్యం గా సచిన్ టెండూల్కర్ అంటే ప్రాణం… అందుకే ఇండియా కి సంభందించి ఏ క్రికెట్ మ్యాచ్ వచ్చిన కూడా సచిన్ బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం టివి ముందు నుంచి కదలకుండా ఆయన బ్యాటింగ్ మొత్తం చూసేవాడు, అలా ఆయన సచిన్ ని ఆరాధించేవాడు ఆయన కూడా సచిన్ లాగా ఒక గొప్ప ప్లేయర్ అవ్వాలని అనుకున్నాడు కానీ ఆయనకున్న భాద్యతలు ఆయన్ని బ్యాట్ పట్టుకోకుండా చేసాయి. అందుకే తన కొడుకు అయినా శుభ్ మన్ గిల్ ని క్రికెటర్ చేయాలనీ అనుకొని ఆయన్ని మంచి క్రికెటర్ ని చేసాడు…
గిల్ కి మూడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే లిఖ్విందర్ గిల్ తన కొడుకు శుభమన్ గిల్ కి క్రికెట్ ఆడటం నేర్పించాడు.గిల్ కి తన తండ్రే మొదటి కోచ్, అప్పుడే గిల్ ఎలా బ్యాట్ పట్టుకొని ఎలా అడాలి, ఎలా షాట్ కొట్టాలి అనే చాలా విషయాలని తెలుసుకున్నాడు. ఇక అలాగే గల్లీ లో జరిగిన ప్రతి మ్యాచ్ లో క్రికెట్ ఆడుతూ 6 సంవత్సరాల వయస్సు లోనే 15 సంవత్సరాల వాళ్ళతో చాలా మ్యాచ్ లు ఆడి కొన్ని మ్యాచులని కూడా గిల్ గెలిపించాడు..అయితే ఒక రోజు గల్లీ లో ఆడిన ఒక మ్యాచ్ లో ఒక బౌలర్ వేసిన బంతి కి గిల్ మొహానికి బాల్ తగిలి చిన్న గాయం అయింది.దాంతో వేరే ప్లేయర్ వచ్చి నేను బ్యాటింగ్ చేస్తాను అని చెప్పిన కూడా గిల్ వేరే వాళ్ళకి బ్యాట్ ఇవ్వకుండా రక్తం కారిన పట్టించుకోకుండా తనే ఆడి ఆ మ్యాచ్ ని గెలిపించాడు…ఇది దగ్గర నుండి చూసిన వాళ్ళ నాన్న గిల్ టాలెంట్ కి, పట్టుదల కి చాలా మురిసిపోయాడు… అప్పుడే శుభమన్ గిల్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఒక మాట చెప్పారు, జీవితం లో ప్రతి స్టేజి లో ఏదో ఒక రకమైన దెబ్బలు తగులుతూనే ఉంటాయి.అవి మానసికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు వాటిని పటించుకోకుండా ఇప్పుడు నువ్వు ఏదైతే పట్టుదలతో ఉన్నవో అదే పట్టుదలతో ముందుకు వెళ్తే నిన్ను ఎవరు ఆపరు, అప్పుడు మాత్రమే నువ్వు సచిన్ టెండూల్కర్ అంత గొప్ప ప్లేయర్ వి అవుతావు అని చెప్పాడు, ఇప్పుడు నువ్వు ఆడిన మ్యాచ్ ని చూసా ఒక ప్లేయర్ కి అదే కావాలి గిల్…నువ్వు ఇక్కడ ఉంటె ఇక ఈ గల్లీ ప్లేయర్ గానే మిగిలిపోతావ్ అదీ కాదు మన కల, నీ పేరు ప్రపంచ క్రికెట్ చరిత్ర లో నిలిచిపోవాలి అంటూ గిల్ ని తీసుకొని వాళ్ళ నాన్న మొహాలీ కి చేరుకున్నాడు. ఊళ్ళో ఉన్న పొలం ని కౌల్ కి ఇచ్చేసి మొహాలీ కి వెళ్లి అక్కడ ఒక క్రికెట్ అకాడమీ లో గిల్ ని చేర్పించాడు కానీ అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉండటం తో గిల్ మీద కోచ్ స్పెషల్ కేర్ తీసుకునే వాడు కాదు.
ఇక దాంతో లిఖ్విందర్ సింగ్ తనే స్వయంగా గిల్ కి కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసాడు…గిల్ ఫోకస్ మొత్తం క్రికెట్ మీదనే పెట్టాడు…అయితే అప్పుడు వీళ్ళకి తినడానికి సరిగ్గా తిండి లేకపోతే కొన్నిసార్లు పస్తులు ఉండేవారు,కానీ క్రికెట్ ని మాత్రం విడిచేవాడు కాదు గిల్…ఈయన మ్యాచ్ లు ఆడటం ఆడిన ప్రతి చోట బ్యాట్ తో తన ప్రతిభ ఏంటో అందరికి తెలిసేలా చేయడం చేస్తూ చాలా మ్యాచ్ లు ఆడుతూ అందులో గెలుస్తూ తన ఆట ని మెరుగు పరుస్తూ ఉండేవాడు…
ఆ క్రమం లోనే 2017 వ సంవత్సరం లో పంజాబ్ తరుపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేసాడు.అరంగేట్రం లోనే హర్భజన్ సింగ్ కెప్టెన్సీ లో ఆడాడు.అక్కడ కూడా గిల్ తన ప్రతిభని నిరూపించుకున్నాడు.2013 -14 అలాగే 2014 – 15 సంవత్సరాల్లో బిసిసిఐ తరుపున నుంచి బెస్ట్ జూనియర్ గా అవార్డు కూడా వచ్చింది…ఇక అండర్ 19 లో జరిగే మ్యాచులకి 2016 – 17 సంవత్సరాలకు గాను కెప్టెన్ గా ఉన్నాడు…ఈయన కెప్టెన్సీ లో జరిగిన అండర్ 19 సెమి ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ మీద సెంచరీ చేసి ఇండియా టీం ని గెలిపించాడు. ఇక అలాగే ఆస్ట్రేలియా మీద జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కూడా ఇండియా టీం ని గెలిపించి అండర్ 19 వరల్డ్ కప్ ని టీం కి అందించాడు…అలాగే ఆ వరల్డ్ కప్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసి ప్లేయర్ అఫ్ ది సిరీస్ గా నిలిచాడు…
ఈ కప్ తెచ్చిన తరువాత గిల్ అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు బ్యాటింగ్ చేస్తే అవతల బౌలర్ అనేవాడు భయపడతాడు అని ప్రపంచం అంతటికి తెలిసింది…21 సంవత్సరాలకే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేసాడు…26 డిసెంబర్ 2020 వ సంవత్సరం లో ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ ఓపెనర్ ప్లేయర్ గా వచ్చాడు…ఇక రెండు టెస్టుల్లో కలిపి 161 పరుగులు చేసాడు.ఒక మ్యాచులో అర్థ సెంచరీ చేసాడు.
30 జనవరి 2019 లో ఇంటర్నేషనల్ వన్డే సిరీస్ కూడా ఆడాడు న్యూజిలాండ్ మీద ఆడిన ఈ మ్యాచ్ లో గిల్ దారుణం గా ఫెయిల్ అయ్యాడు… 21 బంతులు ఆడిన గిల్ 9 పరుగులు మాత్రమే చేసాడు….2018 సంవత్సరం లో ఐపీల్ లో గిల్ ని కలకత్తా టీం కోటి ఎనభై లక్షలకి కొనుగోలు చేసింది.ఇక 2018 ,19 ,20 ,21 ఈ నాలుగు సీజన్లలో గిల్ కలకత్తా టీం తరుపున ఆడాడు, ఆ తర్వాత 2022 నుంచి ప్రస్తుతం వరకు కూడా గుజరాత్ టీం తరుపున ఆడుతున్నాడు…ఇక ఈ ఇయర్ అయితే గిల్ కి చాలా కలిసి వచ్చిందనే చెప్పాలి ఈ ఇయర్ లో అటు టెస్టులో మొదటి డబుల్ సెంచరీ చేసాడు, అలాగే వన్డే ఇంటెర్నేషన్ మ్యాచ్ లో మొదటి సెంచరీ నమోదు చేసుకున్నాడు. అలాగే t 20 ల్లో కూడా మొదటి సెంచరీ చేసాడు ఇక ఐపీల్ లో అయితే ఏకం గా మూడు సెంచరీ లు చేసి ఈ సీజన్ ఐపీల్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు అలాగే ఆరెంజ్ క్యాప్ ని కూడా సొంతం చేసుకున్నాడు…
ఇక ఇప్పుడు రాబోయే అన్ని ఫార్మాట్లకి ఇండియన్ టీం తరుపున ఓపెనర్ గా గిల్ చాలా బాగా సెట్ అయ్యాడు.అయితే వాళ్ళ నాన్న కన్నా కల, తన కొడుకుని సచిన్ అంత వాడిని చేయాలనీ అనుకున్నాడు కానీ ఇప్పుడు సచిన్ కూతురు గిల్ ఇద్దరు కూడా ప్రేమ లో ఉన్నారు, వీలైతే గిల్ సచిన్ కూతురిని పెళ్లి చేసుకోవచ్చు ఆలా చేస్తే తాను ఎంతగానో ఆరాధించిన సచిన్ తనకి వియ్యంకుడు అవుతాడు.ఇదే కదా సక్సెస్ అంటే గిల్ కి వాళ్ళ నాన్న ఇచ్చిన ప్రోత్సాహం చాలా గొప్పది. ఆయన ఎక్కడైతే మ్యాచ్ లు ఆడటం ఆపేశాడో అక్కడి నుంచే తన కొడుకు అయిన గిల్ కెరియర్ పైన దృష్టి పెట్టి అతన్ని సక్సెస్ చేయడనికి చాలా కష్టపడ్డాడు..సక్సెస్ అనేది కష్ట పడితే ఈజీగా వస్తుంది అనడానికి శుభమన్ గిల్ కెరియర్ ఒక ఉదాహరణ…ఇక ఇంటర్నేషనల్ లోకి ఫుల్ ఫ్లెడ్జుడ్ క్రికెటర్ గా వస్తున్నా గిల్ చాలా రికార్డు లు బద్దలు కొట్టడం పక్క అని తెలుస్తుంది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Interesting facts about shubman gill
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com