ఢిల్లీ అల్లర్ల వెనుక అసలు వాస్తవాలు!

ఢిల్లీ అల్లర్లలో ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం నుంచి 25వ తేదీ వరకు కీలక ఘట్టం అని చెప్పొచ్చు. కర్రలు, రాళ్లు, రివాల్వర్లతో అల్లరి మూకలు యథేచ్ఛగా లూటీలు, విధ్వంసకాండకు తెగబడడాన్ని బట్టి అదంతా ఒక స్క్రిప్టు ప్రకారమే జరిగిందని ఢీల్లి మైనార్టీ స్ కమిషన్ ఛైర్మన్ జఫారుల్ ఇస్లామ్ ఖాన్ ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక నిరసనలను చల్లార్చడానికే ఢిల్లీ అల్లర్లు చేయించారని ఆయన తెలిపారు. సీఏఏ వ్యతిరేక నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని హింసకు […]

Written By: Neelambaram, Updated On : March 14, 2020 5:16 pm
Follow us on

ఢిల్లీ అల్లర్లలో ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం నుంచి 25వ తేదీ వరకు కీలక ఘట్టం అని చెప్పొచ్చు. కర్రలు, రాళ్లు, రివాల్వర్లతో అల్లరి మూకలు యథేచ్ఛగా లూటీలు, విధ్వంసకాండకు తెగబడడాన్ని బట్టి అదంతా ఒక స్క్రిప్టు ప్రకారమే జరిగిందని ఢీల్లి మైనార్టీ స్ కమిషన్ ఛైర్మన్ జఫారుల్ ఇస్లామ్ ఖాన్ ఆరోపించారు.

పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక నిరసనలను చల్లార్చడానికే ఢిల్లీ అల్లర్లు చేయించారని ఆయన తెలిపారు. సీఏఏ వ్యతిరేక నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడేందుకు కొన్ని వారాల ముందే పక్కా ఏర్పాట్లు జరిగాయని, ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం నుంచి 25వ తేదీ వరకూ ఢిల్లీ జరిగిందంతా ‘ఏక పక్ష దాడి’ అని జఫారుల్ ఇస్లామ్ ఖాన్ అన్నారు.

ఈశాన్య ఢిల్లీని సందర్శించిన తర్వాత మైనార్టీ స్ కమిషన్ ఓ నివేదిక విడుదల చేసింది. అలర్లకు పాల్పడేందుకు దాదాపు 2000 మంది అక్కడికి వచ్చారని అందులో పేర్కొంది. 50 ఇళ్లు ఉన్న వరుసలో ఒక వర్గానికి చెందిన ఐదు ఇళ్లను మాత్రమే తగలబెట్టడం, 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువకులు ముఖాలు దాచుకునేందుకు హెల్మెట్లు ధరించడం, అల్లర్లలో నష్టపోయినవారిలో మాత్రం 80-90 శాతం మంది ఒకే వర్గంవారు. వీటన్నిటిని బట్టి చూస్తే అల్లర్లు ఏక పక్ష దాడులని ఆయన తెలిపారు.

పార్లమెంటులో అమిత్ షా మాట్లాడుతూ.. ఢిల్లీ అల్లర్లల్లో 300 మంది బయటి వ్యక్తులు ఉత్తర్‌ ప్రదేశ్ నుంచి వచ్చారని చెప్పారు, దీనిని బట్టి అల్లర్లు ఎవరు చేసారో ఆయనకే తెలుసని జఫారుల్ అన్నారు. అదే విధంగా ఢిల్లీ అల్లర్ల తర్వాత సీఏఏ నిరసనలు తగ్గిపోయాయని ఇదే బీజేపీ వ్యూహమని ఆయన ఆరోపించారు.