https://oktelugu.com/

కంగనా సోదరి.. చిత్రసీమకు ఓపెన్ ఛాలెంజ్

బాలీవుడ్ భామ కంగనా రనౌత్ భారీ విజయాలతో దూసుకుపోతుంది. అగ్రహీరోలకు ధీటుగా కంగనా రనౌత్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. కంగనా బొమ్మ కనపడితే చాలు పక్కన హీరోలతో సంబంధం లేకుండా సినిమా విజయం సాధిస్తుంది. ఈ అమ్మడు స్టార్ హీరోలకు ధీటుగా లేడి ఓరియెంటెడ్ మూవీల్లో నటిస్తూ వందల కోట్ల రూపాయాల కలెక్షన్లను ఈజీగా రాబడుతుంది. దీంతో ఈ భామతో సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ ఆమెకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 14, 2020 / 05:07 PM IST
    Follow us on

    బాలీవుడ్ భామ కంగనా రనౌత్ భారీ విజయాలతో దూసుకుపోతుంది. అగ్రహీరోలకు ధీటుగా కంగనా రనౌత్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. కంగనా బొమ్మ కనపడితే చాలు పక్కన హీరోలతో సంబంధం లేకుండా సినిమా విజయం సాధిస్తుంది. ఈ అమ్మడు స్టార్ హీరోలకు ధీటుగా లేడి ఓరియెంటెడ్ మూవీల్లో నటిస్తూ వందల కోట్ల రూపాయాల కలెక్షన్లను ఈజీగా రాబడుతుంది. దీంతో ఈ భామతో సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు.

    కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ ఆమెకు ఎల్లప్పుడు సపోర్టుగా ఉంటుంది. కంగనాను ఎవరైనా ఏదైనా అంటే వెంటనే సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తుంటుంది. తాజాగా రంగోలీ బాలీవుడ్‌ ఇండస్ర్టీకి ఛాలెంజ్‌ విసిరారు. ‘ఇండస్ట్రీకి నా ఓపెన్‌ ఛాలెంజ్‌.. కంగనా కాకుండా ఈ జనరేషన్‌ కథానాయికల్లో ఎవరైనా వందకోట్ల భారీ బడ్జెట్‌ను భుజాన వేసుకుని.. కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించి బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోగలరా..? అంటూ సవాల్ విసిరింది. అంతేకాదు అలాంటి నటి పేరు ఒకటి చెప్పినా కంగనా సినిమాలకు స్వస్తి పలుకుతుందని రంగోలీ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

    కంగానా ఈ ఏడాది ‘పంగా’ సినిమాతో భారీ విజయం అందుకుంది. తాజాగా కంగనా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా తెరకెక్కుతున్న ‘తలైవీ’ మూవీలో నటిస్తుంది. అలాగే ‘దక్కడ్’, ‘తేజస్’ మూవీలో నటిస్తూ బీజీగా మారింది. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం. ఇటీలవ ‘తేజస్’ ఫస్టు లుక్ విడుదలైంది. యుద్ధ విమానాన్ని నడిపిన ఎయిర్ ఫోర్స్ అధికారిగా కంగానా కన్పించి అభిమానులను ఖుషీ చేసింది.