YSRCP MLC: కొత్తగా ఎంపికైన ఎమ్మెల్సీ బ్యాక్ గ్రౌండ్ చూద్దామా?

YSRCP MLC: ఏపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో కొత్తగా ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. వీరంతా తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డిని మార్యదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ సీటు కోసం వైసీపీ పెద్దఎత్తున పోటీ నడుస్తోంది. ఈక్రమంలోనే సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల విధేయతను పరిణలోకి తీసుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఏపీలో 14 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండగా మంగళవారం నాడు ముగ్గురు అభ్యర్థులకు ఎమ్మెల్సీలుగా జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. వీరిలో […]

Written By: NARESH, Updated On : November 16, 2021 3:16 pm
Follow us on

YSRCP MLC: ఏపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో కొత్తగా ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. వీరంతా తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డిని మార్యదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ సీటు కోసం వైసీపీ పెద్దఎత్తున పోటీ నడుస్తోంది. ఈక్రమంలోనే సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల విధేయతను పరిణలోకి తీసుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.

YSRCP New MLCs

ఏపీలో 14 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండగా మంగళవారం నాడు ముగ్గురు అభ్యర్థులకు ఎమ్మెల్సీలుగా జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. వీరిలో కడప జిల్లాకు చెందిన డీసీ గోవిందరెడ్డి, కర్నూలుకు చెందిన ఇషాక్ బాషా, శ్రీకాకుళం కు చెందిన పాలవలస విక్రాంత్ ఉన్నారు. దీంతో వీరి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన దేవసాని చిన్న గోవిందరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. పార్టీకి వీర విధేయుడిగా జగన్ కు నమ్మకంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు సైతం ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా పార్టీ కోసం కష్టపడ్డారు. మరోవైపు అధికారిగా సైతం ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

1988లో గ్రూపు–1లో ఎంపికైన గోవిందరెడ్డి రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా పనిచేశారు. డిప్యూటీ కమిషనర్‌ ట్రాన్స్‌పోర్ట్‌గా పదోన్నతి పొంది 2001లో రాజీనామా చేశారు. అనంతరం దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్సార్‌ మృతి తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారు. అధినేత ఆదేశాల మేరకు ఆపార్టీ తరఫున 2014లో జయరాములు, 2019లో డాక్టర్‌ వెంకట సుబ్బయ్యలను ఎమ్మెల్యేలుగా గెలిపించారు. ఆయన సేవలను గుర్తించిన సీఎం జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

శ్రీకాకుళానికి చెందిన పాలవలస విక్రాంత్ సైతం పార్టీకి విధేయుడిగా జగన్ కు నమ్మినబంటుగా ఉన్నారు. రాజకీయంగా వీరి కుటుంబానికి జిల్లా మంచి పలుకుబడి ఉంది. విక్రాంత్ తాత పాలవలస సంఘం నాయుడు, నాయనమ్మ రుక్ముణమ్మ ఉణుకూరు ఎమ్మెల్యేలుగా సేవలందించారు. తండ్రి రాజశేఖరం ఎమ్మెల్యేగా.. రాజ్యసభ సభ్యుడిగా.. జెడ్పీ చైర్మన్‌గా సేవలందించారు. ఇక విక్రాంత్ సైతం డీసీసీబీ చైర్మన్ గా పని చేశారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఈ కారణంగానే ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం దక్కింది.

కర్నూలు జిల్లాలోని నంద్యాలకు చెందిన ఇసాక్‌బాషాకు జగన్ వద్ద మంచి పేరుంది. పార్టీకి వీర విదేయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మైనార్టీ వర్గ నేతగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2018లో వైఎస్సార్‌సీపీ నంద్యాల పట్టణ శాఖ అధ్యక్షుడిగా పని చేసిన ఆయన ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, నంద్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన జగన్ తాజాగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

ఈ ముగ్గురు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా స్థానం దక్కించుకోగా మరికొందరు వైసీపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా ఎంపికయ్యారు. వీరిలో విజయనగరం నుంచి ఇందుకూరు రాజు, విశాఖ నుంచి వరుదు కళ్యాణి, వంశీ కృష్ణయాదవ్, తూర్పు గోదావరి నుంచి అనంత ఉదయ్ భాస్కర్, కృష్ణా నుంచి మొండితోక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్, గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, ప్రకాశం నుంచి తూమాటి మాధవరావు, చిత్తూరు నుంచి కృష్ణ రాఘవ జయేంద్ర భరత్, అనంతపురం నుంచి వై.శివరామిరెడ్డిలు ఉన్నారు.