గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రి, మెడికల్ కాలేజీపై బడాబాబుల కన్ను పడింది. ఇంకేముంది డైరెక్టర్లలో విభేదాలు సృష్టించి సంస్థనే దక్కించుకుందామనే దరిద్రపు ఆలోచనకు పూనుకున్నారు. ఎప్పుడో మూడు నెలల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. దీనికి కారణం డాక్టర్ బుచ్చయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆయన పోలీస్ స్టేషన్ కు వచ్చి స్వయంగా ఫిర్యాదు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పినా పోలీసులకు చెప్పడం గమనార్హం.
నిజానికి డాక్టర్ బుచ్చయ్య ఎప్పుడో మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నారై ఆస్పత్రి డైరెక్టర్ల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు చోటుచేసుకోవడంతో ఆయన ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు అనుకోకుండా నలుగురు డైరెక్టర్లపై కేసులు పెట్టి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గురువారం డైరెక్టర్ల బోర్డు సమావేశం ఉండడంతోనే పోలీసులు ఈ విధంగా చేశారని పేర్కొంటున్నారు. మూడు నెలల కాలంలో వచ్చిన మార్పేమిటో ఎవరికి అర్థం కావడం లేదు. ఆస్పత్రిపై వైసీపీ నేతల కన్ను పడడంతోనే వారిలో వైషమ్యాలు సృష్టించి దాన్ని దక్కించుకోవాలనే తాపత్రయం పడుతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ల మధ్య ఉన్న గొడవలను ఆసరాగా చేసుకుని వారిలో సఖ్యత లేకుండా చేసి సెటిల్మెంట్ పేరుతో ఆస్పత్రిని హస్తగతం చేసుకోవాలనే దురాలోచనలో ఉన్నట్లు సమాచారం.
అందుకే డైరెక్లర్లకు భయం వేసింది. ఆస్పత్రి మీద వారి కన్ను పడిందని భావించి తమ వివాదాన్ని తామే పరిష్కరించుకోవాలని భావించారు. దీంతో ఫిర్యాదు వెనక్కి తీసుకుంటున్నట్లు బుచ్చయ్య పేర్కొన్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఫిర్యాదు వెనక్కి తీసుకోవడం కుదరదని తేల్చడంతో డైరెక్ట్టర్లు ఖంగుతిన్నారు. పోలీసులు డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాల పేరుతో కొత్త ఆట మొదలెట్టారు. దీంతో ఆస్పత్రిపై అధికార పార్టీ నేతల కన్ను పడడంతో డైరెక్టర్లలో భయం పట్టుకుంది. ఎలాగైనా వారి బారి నుంచి రక్షించుకోవాలని చూస్తున్నారు.