https://oktelugu.com/

ఎంపీకి షోకాజ్ నోటీసు ఇచ్చిన వైసీపీ..!

వైసీపీలో ఉంటూ ఆ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఆ పార్టీ చర్యలు చేపట్టింది. ప్రాధమికంగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయ సాయి రెడ్డి పేరుతో షోకాజ్ నోటీస్ ను జారీ చేశారు. భారత – చైనా గొడవల్లో కమ్యూనిస్టులు ఎక్కడ? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జిల్లా మంత్రి రంగనాథ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 24, 2020 / 03:19 PM IST
    Follow us on


    వైసీపీలో ఉంటూ ఆ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఆ పార్టీ చర్యలు చేపట్టింది. ప్రాధమికంగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయ సాయి రెడ్డి పేరుతో షోకాజ్ నోటీస్ ను జారీ చేశారు.

    భారత – చైనా గొడవల్లో కమ్యూనిస్టులు ఎక్కడ?

    అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జిల్లా మంత్రి రంగనాథ రాజు, ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, తదితరులు జగన్ తో సమావేశమైనప్పుడు రఘురామ కృష్ణంరాజు వ్యవహారాన్ని ఏదో ఒకటి తేల్చాలంటూ పట్టుబట్టారు. అదే సమయంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు పందులే గుంపులుగా వస్తాయి…అంటూ వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను జగన్ బొమ్మ పెట్టుకుని గెలవలేదని, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు అందరూ తన బొమ్మతో గెలిచారని, వారు రాజీనామా చేస్తే తాను రాజీనామా చేస్తానని, అందరం ఎన్నికల్లో నిలబడదామని సవాల్ విసిరారు.

    చంద్రబాబు కోటరీ బీజేపీని దెబ్బతీస్తుందా?

    అంతే కాకుండా తాను వైసీపీలోకి రానంటే కాళ్ళు పట్టుకుని బ్రతిమాలాడితే పార్టీలోకి వచ్చానని చెప్పిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలతో వైసీపీ మరింత ఇరుకున పడింది. అదేవిధంగా సీఎం జగన్ చుట్టూ కోటరీ, టిటిడి భూముల విక్రయం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, ఇసుక సరఫరా, ఇళ్ల స్థలాల సేకరణ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు గళం విప్పారు. ఎట్టకేలకు పార్టీ ఆయనకు షోకాజ్ జారీ చేయడం ఆసక్తిగా మారింది. దీనికి రఘురామ కృష్ణంరాజు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశం.